Komatireddy: ఆ ఇద్దరికి పోలీసులే బేడీలు వేసి..తీసుకుపోతారు..! 4 d ago
బీఆర్ఎస్ నేతలు బేడీలు వేసుకుని అసెంబ్లీకి రావడంపై మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. రేపో మాపో పోలీసులే వారికి బేడీలు వేస్తారని వ్యాఖ్యానించారు. అసలైన దొంగలు బేడీలు వేసుకోలేదని, మిగతా సభ్యులు మాత్రం బేడీలు వేసుకున్నారని కేటీఆర్, హరీష్ రావుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. ఆ ఇద్దరికి పోలీసులే బేడీలు వేసి తీసుకుపోతారని మంత్రి కోమటిరెడ్డి ఏద్దేవా చేసారు.